చిన్నారిపై చిరుత పులి దాడి

చిన్నారిపై చిరుత పులి దాడి

NDL: శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలో గల చిన్నారుట్ల గూడెంలో నిన్న రాత్రి చిన్నారి కుడుముల అంజమ్మపై చిరుత పులి దాడి చేసింది. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని చిరుత ఎత్తుకెళ్తుండగా తండ్రి అంజయ్య గమనించి తరిమాడు. దీంతో చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. చిన్నారి తల పొట్టబాగాన గాయాలు కావడంతో సున్నిపింట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించామన్నారు.