వృద్ధురాలిపై ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆప్యాయత

ATP: MLA బండారు శ్రావణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. ఆమె బుగ్గలపై చేయి వేసి బాగోగులు తెలుసుకున్నారు. పింఛన్ ప్రతినెలా సక్రమంగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను MLA అభిమానులు పిక్ ఆఫ్ ది డే అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.