పేకాట శిబిరంపై పోలీసుల దాడి
W.G: నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామ శివారులో నిన్న రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు మొగల్తూరు ఎస్సై వై. నాగలక్ష్మి తెలిపారు. ఈ దాడిలో తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు. రూ.7,470 నగదు, 52 పేక ముక్కలు, తొమ్మిది సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.