జర్మనీ కొత్త ఛాన్స్‌లర్‌గా ఫ్రెడ్రిక్ మెర్జ్

జర్మనీ కొత్త ఛాన్స్‌లర్‌గా కన్జర్వేటివ్ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో మొదట 6 ఓట్ల తేడాతో ఓటమి చెందినా.. రెండో ప్రయత్నంలో మెజార్టీ సాధించారు. దిగువ సభ 'బుందెస్టాగ్'లో మొత్తం 630 స్థానాలు ఉండగా.. గెలుపునకు 316 ఓట్లు అవసరం. 325 ఓట్లు సాధించిన ఆయన.. జర్మనీ 10వ ఛాన్స్‌లర్‌గా బాధ్యతల స్వీకరించనున్నారు.