'పార్కులో వాకర్స్‌కి అన్ని వసతులు కల్పించండి'

'పార్కులో వాకర్స్‌కి అన్ని వసతులు కల్పించండి'

TPT: పద్మావతి పార్కులో వాకర్స్ కొరకు వాకింగ్ ట్రాక్ బాగు చేసి, జిమ్ పరికరాలకు మరమ్మతులు చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం పద్మావతి పార్కు, పక్కనే ఉన్న మస్టర్ గదిని కార్పొరేటర్ షాలిని, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు.