రెడ్ హ్యాండెడ్‌గా ACBకి చిక్కిన అధికారి

VKB: కలెక్టరేట్‌లోని రెవెన్యూ సెక్షన్‌లో పనిచేస్తున్న సుజాత అనే ఉద్యోగిని రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయ ప్రొసీడింగ్ కాపీ పంపేందుకు ఆమె లంచం డిమాండ్ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.