దారుణం.. ప్రేమజంటపై కత్తులతో దాడి
తమిళనాడు వేలంకన్నీలో దారుణం చోటుచేసుకుంది. 2 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి కుటుంబం ఇవాళ కత్తులతో దాడికి దిగింది. ఈ దాడిలో యువకుడితో పాటు అతని తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నాగపట్నం ఆస్పత్రికి తరలించారు. అటు ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు కడలూరులో అదుపులోకి తీసుకున్నారు.