రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలకు తీవ్ర గాయాలు

SKLM: సంతబొమ్మాలి మండలం ఉదయపురం గ్రామానికి చెందిన వీ.సంజీవ్, సరస్వతి అనే భార్యభర్తలకు ఇవాళ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై గ్రామం నుంచి టెక్కలి వైపు వస్తుండగా రెయ్యిపేట మలుపు వద్ద ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో సంజీవ్ తలకు, తొడ భాగంలో తీవ్రగాయం కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.