'అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయాలి'

BDK: అంగన్వాడీ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో ఈనెల 20న కొత్తగూడెంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం ఈ సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.