పన్ను వసూళ్లపై కమిషనర్ అసంతృప్తి
MBNR: పట్టణ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కమిషనర్ రామానుజుల రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 టీంలు, 70 మంది సిబ్బందిని కేటాయించినా 50% కూడా వసూలు కాలేదన్నారు. గతేడాది రూ.53 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.22.23 కోట్లు మాత్రమే వసూలయ్యాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లిస్తే 5% రాయితీ ఉంటుందన్నారు.