అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
ASF: జైనూర్ (M)లో ఓ ఆశ్రమ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (M)లోని గంగపూర్ గ్రామానికి చెందిన అన్వేష్ జైనూర్‌లోని పనపాటర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 4 తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అన్వేష్ హాస్టల్‌లో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందాడు.