టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

TPT: బెంగళూరుకు చెందిన లాక్విన్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జె. దేవరాజులు, బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. ఇందులో భాగంగా తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమక్షంలో ఈ విరాళాన్ని భక్తుడు స్వయంగా అందజేశారు. కాగా, ఈ ట్రస్టు ద్వారా నిరుపేద రోగులకు కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి వంటి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు.