నేడే సాయంత్రం 5కు ముగియనున్న నామినేషన్ల స్వీకరణ

నేడే సాయంత్రం 5కు ముగియనున్న నామినేషన్ల స్వీకరణ

ASF: సిర్పూర్ నియోజకవర్గంలో సర్పంచ్ నామినేషన్ల 2వ దశకు నేడు చివరి దశకి చేరకుంది. ఈ దశలో సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికలపేట్, దహేగాం మండలాల్లోని 113 గ్రామపంచాయతీలు 992 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆ సమయం వరకు లైన్లలో ఉన్న వారివి స్వీకరిస్తామన్నారు.