'ఫుట్ పాత్‌పై షాపులు తొలిగించొద్దు'

'ఫుట్ పాత్‌పై షాపులు తొలిగించొద్దు'

MDK: మెదక్ పట్టణంలోని ఫుట్ పాత్‌పై ఉన్న చిరు వ్యాపారులను తొలగించడం మానుకోవాలని మెదక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. వారిని వధించరాదని కోరారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, జుబేర్ తదితరులు ఉన్నారు.