నేడు విశ్వవిద్యాలయంలో క్యాంపస్ డ్రైవ్
KDP: బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. బెంగళూరులోని ఎమ్ఐ సంస్థ ఈ ప్రాంగణ ఎంపికలో పాల్గొంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు వారి బయోడేటాతో నూతన పరిపాలన భవనంలోకి హాజరుకావాలని సూచించారు.