వృద్ధాశ్రమంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
E.G: కొవ్వూరులో రీనా చారిటబుల్ సొసైటీ నిర్వహించిన వాత్సల్య వృద్ధాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టుమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, సూరపని చిన్ని, సూర్యదేవర రంజిత్, వేమగిరి వెంకట్రావు, పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులతో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.