కిడ్నాపర్ల నుంచి బాలుడిని రక్షించిన పోలీసులు
కృష్ణా: పెనమలూరులో చోటు చేసుకున్న కిడ్నాప్ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి బాలుడిని రక్షించి, రూ.80,500 నగదు సీజ్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. వేసవికాలంలో స్కూళ్లకి సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఆడుకోవడానికి మొగ్గుచూపుతారని, కావున పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు.