VIDEO: యాసంగి వడ్లకు బోనస్ చెల్లించాలి: మాజీ MLA
WGL: రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్లకు బోనస్ చెల్లించాలని, మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖానాపూర్ మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలను అరికట్టాలన్నారు.