'రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు'
AKP: రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదని అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ రైతుకు రూ.1.11 లక్షల విద్యుత్ బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇదేవిధంగా ఒక గ్రామంలో 25 మందికి వ్యవసాయ విద్యుత్ బిల్స్ వచ్చాయన్నారు.