'2 రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం'

అనంతపురం: నార్పల మండల కేంద్రంలోని దుగుమర్రి రోడ్డు గుంతలు పడి అస్తవ్యస్తంగా మారిపోయింది. నార్పల బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపించారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీకి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.