కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వెంకటాపూర్ సర్పంచ్
MNCL: మందమర్రి మండలం వెంకటాపూర్ సర్పంచ్ వెంకటేశ్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వివేక్ సమక్షంలో ఆయన పార్టీలో చేరగా, మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. ఆరు గ్యారెంటీలను గ్రామంలోని అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తానన్నారు.