'నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను మూసివేయాలి'

'నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను మూసివేయాలి'

NZB: ఆర్మూర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలను మూసివేయాలని యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వాణిజ్య భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.