రూ.10 వేల కోట్లు అడిగిన ఎయిరిండియా?
ఎయిరిండియా సంస్థ తన ప్రమోటర్లైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని కోరినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం కారణంగా సంస్థకు నష్టం వాటిల్లి, ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలిందని సమాచారం. కార్యకలాపాలు, ప్రణాళికల కొనసాగింపు కోసం ఈ భారీ మొత్తం అవసరమని సంస్థ కోరినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.