పాడేరులో ట్రాఫిక్ జామ్
ASR: పాడేరు ఘాట్ రోడ్డులో ఆదివారం రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పాడేరు నుంచి విశాఖ వెళ్తున్న భారీ లారీ, ఘాట్ రోడ్డు మలుపు వద్ద టర్నింగ్ కట్ అవ్వక రక్షణ గోడ ఢీకొని నడిరోడ్డులో ఇరుక్కుపోయింది. దీంతో సుమారు 2 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డు కావడంతో ఇటు విశాఖ, అటు పాడేరు వెళ్లే ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.