బాధిత కుటుంబానికి జనసేన ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి జనసేన ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

KKD: ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదేల పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. బుధవారం పెద్దాపురం మండలం చదలాడ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణికంఠ అనే క్రియాశీల కార్యకర్త కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5 లక్షల జనసేన ఇన్సూరెన్స్ చెక్‌ను అందజేశారు.