మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ కుట్ర: బీజేపీ చీఫ్
AP: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆరోపించారు. 25 ఏళ్ల కలను సాకారం చేస్తూ ప్రధాని మోదీ.. 2023లో ఈ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. డీలిమిటేషన్, జనగణన తర్వాతే ఈ బిల్లు అమలు అన్న నిబంధనపై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం అని మండిపడ్డారు. ఇది మహిళలను మోసం చేయడమేనన్నారు.