'పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలి'
VZM: పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ కోరారు. గురువారం పట్టణంలో జరిగిన జేఎంఎల్ బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజాంలో పరిశ్రమలు మూతపడడంతో చెప్పుకోదగ్గ పరిశ్రమ లేకుండా పోయిందన్నారు. పూర్వపు వైభవం తెచ్చేలా బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్నారు.