అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్
కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఆలయంలో నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.