భూధాన్ భూముల కేసులో IAS, IPSలకు ఊరట

భూధాన్ భూముల కేసులో IAS, IPSలకు ఊరట

TG: భూదాన్ భూముల కేసులో IAS, IPSలకు ఊరట లభించింది. నాగారం సర్వే నెం. 194, 195లలో బ్యూరోక్రాట్‌లు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో ఉంచాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఆ భూములు భూదాన్ భూములు కావని, పట్టా భూములేనని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అయితే, సర్వే నెం. 181, 182లలోని భూములపై యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది.