ఆలయానికి పోటెత్తిన భక్తులు

SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, నిజాభిషేకాలు, కళ్యాణోత్సవాలు జరుపుకున్నారు.