ఒంగోలులో నిర్వహించనున్న బ్లెడ్ డొనేషన్ క్యాంప్

ఒంగోలులో నిర్వహించనున్న బ్లెడ్ డొనేషన్ క్యాంప్

ప్రకాశం: ఒంగోలులో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరాయ విద్యాలయం వారిచే మెగా శిబిరం నిర్వహించనున్నట్లు గురువారం నిర్వాహకులు తెలిపారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా రెడ్ క్రాస్ సొసైటీలో శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. యువత పాల్గొని రక్తదానం చేయాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.