VIDEO: సింహాచలంలో ప్రారంభమైన నృసింహా దీక్షలు
AKP: సింహాచలంలో ఇవాళ నృసింహ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనేక మంది భక్తులు దీక్షలు స్వీకరించారు. మాల ధరించిన వారికి తులసి మాలలు, స్వామి ప్రతిమలు ఉచితంగా అందించారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12 వరకు దీక్షలు కొనసాగనున్నాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో సుజాత తెలిపారు.