50 మంది జూదగాలను అరెస్టు చేసిన సీఐ

KRNL: పత్తికొండలో పలుచోట్ల పేకాట ఆడుతున్న 50 మందికి పైగా జూదగాలను అరెస్టు చేసినట్టు సీఐ జయన్న తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పక్క సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడులు చేశామని పేర్కొన్నారు. వారి నుంచి రూ.1.40 లక్షల నగదు, 40 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 50 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.