పామూరులో వందేమాతరం గీతాలాపన
ప్రకాశం: వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కనిగిరి పామూరు రోడ్‌లో ఉన్న సచివాలయంలో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఆలపించారు. స్వతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు వందేమాతరం గీతం ఉత్తేజాన్ని నింపిందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.