మోటుపల్లి టీడీపీ అధ్యక్షునిగా కోటిరెడ్డి ఎన్నిక

మోటుపల్లి టీడీపీ అధ్యక్షునిగా కోటిరెడ్డి ఎన్నిక

ప్రకాశం: వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీ ఎన్నికలు మండల టీడీపీ అధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. గ్రామ కమిటీ అధ్యక్షునిగా ముక్కు కోటిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పుల్లగూర చిన్న నరసింహులు ఎన్నికయ్యారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షులు కోటిరెడ్డి తెలిపారు.