ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

NRML: ఖానాపూర్ శివాజీనగర్ కాలనీకి చెందిన తరుణ్ (24) ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఏఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇంటర్ పూర్తి చేసి డ్రైవర్‌గా పనిచేసే తరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.