పుంగనూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

పుంగనూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

CTR: పుంగనూరు మండల సమీపంలోని బటన్ దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న చిన్న రెడ్డప్ప (57)ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.