క్రీడల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం
సత్యసాయి: రాష్ట్రస్థాయి కరాటే, జూడో స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించిన ధర్మవరం విద్యార్థులను బుధవారం టీడీపీ నాయకుడు సందా రాఘవ సన్మానించారు. సాహితీ, హారిక, సుష్మిత, అఖిలభాను, సింధూ, ద్రాక్షాయణి, సంధ్యలను ఆయన శాలువాలతో సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు.