శ్రీ రాముని జీవితం ఆదర్శనీయం: మంత్రి

శ్రీ రాముని జీవితం ఆదర్శనీయం: మంత్రి

JGL: శ్రీరాముని జీవితం ఆదర్శమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో, తీగల ధర్మారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.