విశ్వ విజేతగా భారత్.. మిన్నంటిన సంబరాలు

విశ్వ విజేతగా భారత్.. మిన్నంటిన సంబరాలు

టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి టీమిండియా గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలు నగరాల్లో రోడ్లపైకి వచ్చి అభిమానులు టపాసులు కాలుస్తూ వేడుకలు చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతిలో అభిమానులు జాతీయ పతాకాలతో రోడ్లపైకి వచ్చి జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా వేడుకల్లో పాల్గొన్నారు.