మిషన్ భగీరథపై మంత్రి సమీక్ష
MLG: మిషన్ భగీరథ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. ENC కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో హాజరయ్యారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు నిరంతర నీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు.