చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, ఎమ్మెల్యే

TTP: తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్‌లో స్వచ్ఛతాహీ సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.