భగ్గుమంటున్న ఉమ్మడి మహబూబ్‌నగర్
MBNR: మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భానుడు ప్రతాపం చూపాడు. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్‌లో 39.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై జిల్లాలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.