పర్యాటక ప్రాంతాలలో పటిష్ట భద్రతతో తనిఖీలు
ASR: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో అరకు సీఐ హిమగిరి మంగళవారం అరకులోయలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, వుడెన్ బ్రిడ్జి అన్ని పర్యాటక ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అనుమానంగా తిరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని SI గోపాలరావు తెలిపారు.