యూత్ కాంగ్రెస్ యువ నేత సూసైడ్
HNK: హసన్‌పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి యూత్ కాంగ్రెస్ పరకాల ప్రధాన కార్యదర్శి దూడే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పల్సర్ బైక్‌ను పక్కన ఉంచి రైలుకు ఎదురుగా వెళ్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వగ్రామం నడికుడ మండలం చర్లపల్లి గ్రామంగా పోలీసులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.