విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
SDPT: కొండపాక కస్తూర్బా బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె పప్పు నాణ్యత తక్కువగా ఉండటంపై వంట సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతతో రుచికరంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.