ఈనెల 14 న వాజేడు SI ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా!

WGL: వాజేడు ఎస్సై హరీశ్ తన రివాల్వర్‌తో కాల్చుకొని మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా, ఈనెల 14 న హరీశ్ ఎంగేజ్మెంట్ జరగనుందని స్థానికులు తెలిపారు. అంతేకాక ఎంగేజ్మెంట్‌కు సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉందని, తన స్నేహితులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.