తనను పాస్ చేయాలంటూ పేపర్‌లో 500 నోట్లు!
పరీక్షల్లో పాస్ చేయమని వేడుకుంటూ ఓ విద్యార్థి ఆన్సర్ షీట్‌లో నగదు పెట్టి టీచర్‌కు 'ఆఫర్' ఇచ్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పలాము జిల్లాలోని ఓ సెంటర్‌లో ఉపాధ్యాయులు సంస్కృతం పేపర్లను దిద్దుతుండగా ఈ విషయం వెలుగుచూసింది. తనను ఎలాగైనా పాస్ చేయాలని కోరుతూ.. ఓ విద్యార్థి పేపర్ లోపల రెండు రూ.500 నోట్లను ఉంచాడు. ప్రస్తుతం ఆ ఫోటో SMలో వైరల్ అవుతోంది.