ఆధార్ కేంద్రం లేక ప్రజలకు ఇబ్బందులు

ఆధార్ కేంద్రం లేక ప్రజలకు ఇబ్బందులు

KDP: తొండూరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేక రెండు నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఇక్కడ కేంద్రం ఉండగా, ఇప్పుడు అది ఇనగలూరు సచివాలయానికి మార్చేశారు. అక్కడ ఇంటర్‌నెట్ సమస్యలు, సాంకేతిక లోపాల కారణంగా పనులు సాగడం లేదు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాన్ని తిరిగి తొండూరు సచివాలయంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.