శంకర్ గౌడ్ మృతి తీరని లోటు: RTC JAC
ASF: నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందిన కారణంగా ఆసిఫాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రధాన వీధుల గుండా కార్మికులు మౌన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా జేఏసీ ఛైర్మన్ అశోక్, వైస్ ఛైర్మన్ మంజుల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలన్నారు. శంకర్ గౌడ్ మృతి తీరని లోటని తెలిపారు.